ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు… పోలీసులు ప్లాన్ చేసి నా ప్రాణాలు తీయాలనుకున్నారు

-

పోలీసులే ప్లాన్ చేసి నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారని  సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్. నిన్న తనపై జరిగిన దాడికి పోలీసులే కారణమని ఆరోపించారు. నిన్న జరిగిన దాడిలో పాల్గొన్న అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలే అని తెలిపారు. నా పార్టీ కార్యకర్తల వల్లే నా ప్రాణాలు కాపాడుకోగలిగానన్నారు. టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు దాడికి ప్లాన్ చేశారని.. హైదరాబాద్ నుంచి 25 మందిని తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిపై కత్తితో దాడి చేశారని.. దాడి వెనక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్మూర్, బాల్కొండ ప్రాంతంలో ప్రతి పాన్ షాపులో గంజాయి దొరుకుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. పాస్ పోర్టులు అమ్ముకున్న దొంగ సీఎంగా ఉంటే ఇదే పరిస్థితి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

దాడి జరపడానికి ప్లాన్ చేస్తున్నరని గ్రామస్థులు ముందు రోజే మాకు సమాచారం ఇచ్చారని.. ఈవిషయాన్ని సీపీకి, ఏసీపీకి తెలిపానని… మేం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని.. అయినా భద్రత కల్పించలేదని అరవింద్ ఆరోపించారు. మంచి ఆఫీసర్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా తయారు చేస్తుందని అన్నారు. నిజామాబాద్ సీపీ బాధ్యతలు చెపట్టినప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నారని అరవింద్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news