కర్ణాటక బెంగుళూరు ట్రాఫిక్ గురించి అందరికి తెలుసు..ట్రాఫిక్ పునర్వ్యవస్థీకరణలో, ప్రభుత్వం సలీమ్‌ను అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియు స్పెషల్ కమిషనర్ (ట్రాఫిక్) బెంగళూరు సిటీగా నియమించింది..ట్రాఫిక్ పోలీస్ చీఫ్‌గా తిరిగి వస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం అబ్దుల్లా సలీమ్ గురించి అందరికి తెలిసిందే..
బెంగుళూరు ట్రాఫిక్ సమస్యతో కూడిన నగరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈయన కీలక సూచనలు చేశారు..ట్రాఫిక్ నిర్వహణలో డాక్టరేట్ కలిగి ఉన్నారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయన సిటీ ట్రాఫిక్ పోలీస్‌లో పలు పదవులు నిర్వహించారు. దీనికి ముందు, ఎం అబ్దుల్లా సలీమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్, ఈస్ట్) అలాగే అదనపు పోలీసు కమిషనర్ గా ఉన్నారు. మూడు సంవత్సరాలకు పైగా సిటీ ట్రాఫిక్ పోలీసులకు హెల్ప్ చేసిన డాక్టర్ బిఆర్ రవికాంతె గౌడ స్థానంలో ఈయన ఇప్పుడు కొనసాగుతున్నారు..
తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యారు..ఆ సందర్భంగా బెంగుళూరు ట్రాఫిక్ గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.. అదే విధంగా ఆయన ట్రాఫిక్ కంట్రోల్ గురించి ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారో ఆయన వివరించారు.. క్యాబ్ సర్వీస్, ఆటో సర్వీస్లు అలాగే చార్జీల పెంపును తగ్గించేందుకు టెకీ, హాస్పిటల్ ఏరియాలో ప్రత్యేకంగా ఆటో స్టాండ్ లను ఏర్పాటు చేసి, డ్రైవర్స్ సూచనలు కూడా ఇచ్చినట్లు అయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ నగరాల్లో ఉన్న ట్రాఫిక్ రూల్స్ గురించి పోలీసులు తీసుకుంటున్న సూచనలు తెలిపారు.. ప్రజలు కూడా ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సిబ్బందులకు సహకరించాలని ఆయన కోరారు.. ఇందుకు సంబందించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
— TOI Bengaluru (@TOIBengaluru) February 25, 2023