కాంగ్రెస్ కార్యకర్తలపై కేంద్రం దాడులు చేస్తుందని ఆరోపించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. 2024 లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో విపక్ష పార్టీల ఐక్యత పైనే అందరి దృష్టి ఉందని, అయితే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పైనే అందరి అంచనాలు ఉన్నాయని అన్నారు. చత్తీస్గడ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ లో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో బావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని బిజెపిని ఎదుర్కోవాలని సమావేశంలో తీర్మానించారు. ఇక బిజెపిపై విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికలలో ప్రజలకు సంబంధం లేని అంశాలను వారు లేవనెత్తుతున్నారని, అయితే నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, జిడిపి ని ఎలా పటిష్టం చేయాలి? ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాలను ప్రస్తావించే దిశగా రాజకీయాలు ఉండాలన్నారు.