తిరిగి విధుల్లో చేరిన ఐఏఎఫ్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్‌..!

-

జ‌మ్మూ కాశ్మీర్‌లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ మ‌ళ్లీ విధుల్లో చేరాడు. దీంతో అత‌ని రాక‌కై ఎదురు చూసిన తోటి ఆఫీస‌ర్లు అత‌ను రాగానే అత‌నితో ఫొటోలు దిగారు.

బాలాకోట్ విమాన దాడుల్లో అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. పాక్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ గుర్తున్నాడా..? అవును.. అప్ప‌ట్లో అత‌న్ని పాక్ యుద్ధ ఖైదీగా ప‌ట్టుకుని బందీగా ఉంచింది. అయితే పాక్‌పై ఇత‌ర దేశాల నుంచి, ముఖ్యంగా భార‌త్ నుంచి వ‌చ్చిన ఒత్తిడి కార‌ణంగా అత‌న్ని విడిచి పెట్టారు. అయితే అప్ప‌టి నుంచి హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్న అభినంద‌న్ తాజాగా మ‌ళ్లీ విధుల్లో చేరాడు.

జ‌మ్మూ కాశ్మీర్‌లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ మ‌ళ్లీ విధుల్లో చేరాడు. దీంతో అత‌ని రాక‌కై ఎదురు చూసిన తోటి ఆఫీస‌ర్లు అత‌ను రాగానే అత‌నితో ఫొటోలు దిగారు. ఈ సంద‌ర్భంగా అభినంద‌న్ మాట్లాడుతూ.. తాను మ‌ళ్లీ విధుల్లో చేరుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. అలాగే తాను క్షేమంగా తిరిగి రావాల‌ని ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్యవాదాలు తెలుపుతున్నాన‌ని చెప్పాడు. ఈ క్రమంలోనే అభినంద‌న్ మ‌ళ్లీ విధుల్లో చేరిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే అభినంద‌న్‌కు ప్ర‌స్తుతం జైషై మ‌హ‌మ్మ‌ద్ నుంచి ముప్పు పొంచి ఉంద‌ని, అత‌ను ఉగ్ర‌వాదుల హిట్‌లిస్ట్‌లో ముఖ్య‌మైన టార్గెట్‌గా ఉన్నాడ‌ని, అందువ‌ల్ల అత‌న్ని ఎవ‌రికీ తెలియ‌ని సుర‌క్షిత‌మైన ప్ర‌దేశంలో ఉంచ‌నున్నామ‌ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. అతని ప్రాణాల‌కు ముప్పు ఉంద‌నే స‌మాచారం త‌మకు అందింద‌ని.. అందువ‌ల్ల అత‌న్ని ఎవ‌రికీ తెలియ‌ని ప్ర‌దేశంలో సుర‌క్షితంగా ఉంచుతామ‌ని వారు తెలిపారు. ఏది ఏమైనా.. అభినంద‌న్ పాక్ చెర నుంచి బ‌య‌టికి వ‌చ్చి మ‌ళ్లీ విధుల్లో చేర‌డం నిజంగా హ‌ర్ష‌ణీయ‌మే..! అత‌ని ధైర్య సాహసాల‌ను మ‌న‌మంద‌రం మెచ్చుకోవాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news