దంచి కొట్టిన అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్.. భారీ స్కోర్ దిశగా సన్ రైజర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల లతో ముంబై బౌలర్లపై సన్ రైజర్స్ ఆటగాళ్లు విరుచుకుపడుతున్నారు. బౌలర్ ఎవరని చూడకుండా సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.దీంతో SRH కేవలం 7 ఓవర్లలోనే 102* పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా ఆటగాడు ,సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 62 పరుగులతో విధ్వంసం సృష్టించారు. అందులో 2 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా , ఆ తర్వాత కొద్ది సేపటికి మరో ఆటగాడు ఈ రికార్డును బ్రేక్ చేశారు.అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో 50 రన్స్తో చెలరేగారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సర్లు, 2 ఫోర్లున్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. క్రీజ్లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు మార్క్రం, హెన్రిచ్ క్లాస్ న్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news