ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి!

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ దగ్గరలో మినీ బస్సు లోయలో పడి పలువురు మరణించిన ఘటన మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టెంపో లారీని ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ నలుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. అలాగే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగే సమయానికి టెంపోలో 18 మంది ప్రయాణికులు ఉన్నారని, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మృతులంతా మదనపల్లి అంబచెరువు మిట్ట ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారు అని తెలుస్తోంది. మ్రుతులలో ఎనిమిది మంది మహిళలు ఉండగా ఐదు మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు అని చెబుతున్నారు. మృతులు జాఫర్, రఫీ, మస్తాన్, అమీర్, టెంపో డ్రైవర్ గా గుర్తించారు.

TOP STORIES

నడుం నొప్పి తగ్గాలంటే ఈ ప్రాసెస్ పాటించండి..!

ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి. సాధారణంగా నడుం నొప్పి రెండు...