తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు యాక్సిడెంట్.. 17 మందికి తీవ్ర గాయాలు !

Join Our Community
follow manalokam on social media

తెలుగు రాష్ట్రాలలో పరస రోడ్డు ప్రమాదాలు సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న అరకు లోయ వద్ద ఒక మినీ బస్సు లోయలో పడి పోయి చాలా మంది ప్రాణాలు కోల్పోగా ఈరోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో ఒక ప్రమాదం జరిగి సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఈ రోజు తెల్లవారుజామున తెలంగాణ లో ఒక ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ కు గురైంది. కామారెడ్డి శివారులో ఉన్న టేక్రియాల్ వద్ద ఈ తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో 36 మంది ఉండగా సుమారు 17 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వీరిని హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మిగతా గాయపడిన వారందరినీ కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....