వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయట పడింది. ఆ వీడియోలో న్యూడ్ గా ఉన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ఆ మహిళతో మాట్లాడుతున్నాడు.
మహిళతో శృంగారానికి సంబంధించిన విషయాలను మాట్లాడినట్లు రికార్డు అయింది. ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే పలుమార్లు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకోగా.. ఇప్పుడు రాసలీలల వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.