వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో , లారీ , బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి, అందులోని ఏడుగురు ప్రయాణికులు గాయాలు అయ్యాయి. ఆటోని తప్పించ బోయి బస్సు బోల్తా పడగా వెనకాల వస్తున్న లారీ బస్సు ఢీ కొని అది ఆటోని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని ప్రయాణికులు ఇద్దరు మృతి చెందారు. ఈ దెబ్బకు రోడ్డు మీద చెల్లా చెదురుగా వాహనాలు పడి పోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. నిన్న కూడా వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఆర్తీసీ బస్సు త్రుటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో 80 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. కాలం చెల్లిన బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో హైద్రాబాద్ నుండి తాండూరు వెళుతున్న బస్సు అనంతగిరి గుట్టపైకి రాగానే అకస్మాత్తుగా బ్రేకులు పెయిల్ కావడంతో ముందు టెన్షన్ పడిన డ్రైవర్ ఆ తరువాత చాకచక్యంగా బస్సును నడిపి అనంతగిరి గుట్టపైనుండి కేరెల్లి గ్రామానికి తీసుకెళ్లి ఆపాడు. అలా 80 మంది ప్రాణాలు కాపాడాడు.