కెప్టెన్సీలో దుమ్ము రేపిన రహానే… ఆసిస్ దిగ్గజం ఫిదా…!

-

బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా బౌలింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తుంది. రహానే కెప్టెన్సీ లో బౌలర్లు సత్తా చాటుతున్నారు. రహానే పై ఆసిస్ మాజీ దిగ్గజ ఆటగాడు మెక్ గ్రాత్ ప్రసంశల వర్షం కురిపించాడు. శనివారం మెల్‌ బోర్న్‌ లో మొదలైన బాక్సింగ్ డే టెస్ట్ ఉదయం సెషన్‌ లో స్టాండ్-ఇన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రహానే బౌలర్లను వాడుకునే విషయంలో విజయవంతం అయ్యాడు.I will be surprised if Ajinkya Rahane does not promote himself to number  four: Ajit Agarkar

తన బౌలర్లకు అదిరిపోయే మద్దతు ఇచ్చాడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. ఓపెనర్ బర్న్స్ ని కట్టడి చేసిన విధానం చాలా బాగుందని అజింక్య రహానె కెప్టెన్సీని ప్రశంసించాడు. 4 వికెట్లకు ఆస్ట్రేలియా 124 పరుగులు చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు స్మిత్ డకౌట్ అయ్యాడు.

లబుషేన్, మాథ్యూ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టారు. ఇక బూమ్రా, అశ్విన్ ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆస్ట్రేలియాని కట్టడి చేస్తుంది. ఇక అశ్విన్ బౌలింగ్ హైలెట్ గా నిలిచింది. అశ్విన్ వైపే రహానే ఎక్కువగా మొగ్గు చూపాడు. స్మిత్ వికెట్ తీయడంతో అశ్విన్ బౌలింగ్ పై ప్రసంశలు దక్కాయి. మొత్తం 27 ఓవర్ల తొలి సెషన్ లో 13 ఓవర్లు స్పిన్నర్ లే వేసారు. జడేజా, అశ్విన్ ఇద్దరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news