సిద్దిపేట జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద జనవరి 31న పట్టపగలే కాల్పులు జరిపి దారి దోపిడికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. రిజిస్ట్రేషన్ కోసం కారుడలో డబ్బులతో రిజిస్ట్రేషన్ కార్యాలయం గేట్ లోపలికి వచ్చారు. అప్పటికే నిందితులు కారును వెంబడిస్తూ వచ్చారు. కారు ఆగిన సమయంలో కాల్పులు జరిపారు. కారు డ్రైవర్‌పై తొలుత కాల్పులు జరపడం.. ఆ తరువాత కారు అద్దాలు ధ్వంసం చేసి రూ.42.50 లక్షలను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు తాజాగా సిద్ధిపేట కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజు (26), మరొక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా వీరు కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.42 లక్షలకు పైఆ ఎత్తుకెళ్లారు. దాదాపు వారం రోజుల శ్రమించి నిందితులను పట్టుకోవడంతో స్థానికులు పోలీసులను అభినందిస్తునారు.