రాజ్యాంగం నచ్చకపోతే.. రాజీనామా చేయ్‌ : కేసీఆర్‌కు బండి కౌంటర్‌

-

రాజ్యాంగం నచ్చకపోతే.. వెంటనే సీఎం పదవికి రాజానామా చేయాలని కేసీఆర్‌ పై బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. ప్రజల ద్రుష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని వ్యాఖ్యలు చేశారని.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్ర ఇదన్నారు.

bandi sanjay slams cm kcr over indian constitution

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగమేనని.. ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో… అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నరు. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే కేసీఆర్ కు గిట్టదని.. కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో రిజర్వేషన్ల ఊసే ఉండకూడదనుకుంటున్నాడన్నారు.

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడని.. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాడని ఫైర్‌ అయ్యారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news