ఈ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్.. సర్వీసు ఛార్జీలు లో మార్పు..!

-

మీకు ఐసీఐసీఐ బ్యాంకు లో అకౌంట్ వుందా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇక నుంచి ఛార్జీలని పెంచుతున్నట్టు చెప్పింది ఐసీఐసీఐ బ్యాంక్. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన సర్వీసు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. అయితే ఈ చార్జీలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

క్రెడిట్ కార్డు ఆలస్యపు చెల్లింపు ఫీజులను, క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ ఫీజులను, చెక్ రిటర్ను ఫీజులను, ఆటో డెబిట్ రిటర్ను ఫీజులను పెంచుతున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ చెప్పింది. ఇది ఇలా ఉంటే ఎమెరాల్డ్ క్రెడిట్ కార్డు కాకుండా మిగతా అన్ని క్రెడిట్ కార్డులపై ఆలస్యపు చెల్లింపు ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంకు అంది. ఒకవేళ కనుక అవుట్‌స్టాండింగ్ మొత్తం రూ.100 కంటే తక్కువ ఉంటే అప్పుడు బ్యాంక్ ఎలాంటి చార్జీలని చెల్లించమని అనదు.

అంతకంటే ఎక్కువ ఉంటే చార్జెస్ పడతాయి. అవుట్‌స్టాండింగ్ మొత్తం రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు రూ.1200 వరకు ఫీజు చెల్లించాల్సి వుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే ట్రాన్సాక్షన్ ఫీజు కింద అడ్వాన్స్ మొత్తంపై 2.50 శాతం ఛార్జీలు కట్టాలి. కనీసం ఈ మొత్తం రూ.500గా ఉంటుంది. చెక్ రిటర్ను ఫీజు, ఆటో డెబిట్ రిటర్ను ఫీజు అయితే 2 శాతంగా ఉండనున్నాయి. ఇది కూడా కనీసం రూ.500గా ఉంటాయి. జీఎస్టీని అదనంగా కట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news