టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికవడం బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు అచ్చెన్నాయుడు అన్నారు. తనను అధ్యక్షునిగా నియమించినందుకు అధినేత చంద్రబాబుకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందనేందుకు తన నియామకమే నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు.
ఏపీ రాష్ట్ర అద్యక్షునిగా అచ్చెన్నాయుడును ప్రకటించిన చంద్రబాబు… పూర్తిస్థాయి కమిటీ ప్రకటనను పెండింగ్ పెట్టారు. ఇకపోతే జాతయ ప్రధాన కార్యదర్శిగా కంబంపాటి రామ్మోహన్‌ను తీసుకున్న అధినేత… ఆయనకు నేషనల్ పొలిటికల్ ఎఫైర్స్ బాద్యతలు అప్పగించారు. ఏపీ టీడీపీ పూర్తి కమిటీ మాత్రం మరో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.