అచ్చెన్న దుర్మార్గాలకు ఇదొక మచ్చుతునక!

-

ఏపీ టీడీపీ కొత్త కథానాయకుడు, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మైకుల ముందు ఎంత దూకుడుగా ఉంటారో.. తన నియోజకవర్గంలో సామాన్యులు, తనకు అనుకూలంగా లేని జనాలపై కూడా అంతకు మించిన రాక్షసత్వంగా ఉంటారనే విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది!

అవును.. అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో అచ్చెన్న మార్కు అరాచకం రాజ్యమేలుతోంది! అందుకు ఉదాహరణగా నిలిస్తున్నారు మెండ రామ్మూర్తి అనే రైతు! ఆ రైతుకు చెందిన 18 ఎకరాల భూమిని అచ్చెన్నాయుడి అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్‌ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిన క్రమంలో.. ఆ రైతు అడ్డుతిరగడమే చేసిన నేరం! తాము చెప్పిన డిమాండ్ ధరకు భూములు అమ్మలేదనే కారణం తో ఆ రైతుతోపాటు ఆయన కుమారుడిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నరు! ఆ దౌర్జ్యన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… ఆ రైతు కుటుంబంతో కలిపి వేరే గ్రామాల్లో తలదాచుకునేస్థాయిలో!

తమకు కుటుంబానికి భూములు అమ్మలేదనే కారణంతో… ఆ రైతు కుమారుడు బంజీరుపేటలో, రైతు రామ్మూర్తి పెద్దబమ్మిడి గ్రామాల్లో అద్దె ఇళ్లల్లో ఉండాల్సిన పరిస్థి! అక్కడితో అచ్చెన్న మార్కు దౌర్జ్యన్యాలు అయిపోయాయి అనుకుంటే పొరపాటే. అచ్చెన్న కుటుంబస్తులకు భూములు ఇవ్వలేదనే కారణంతో.. రామ్మూర్తికి ఉన్న పోలాకి మండలం ప్రియాగ్రహారంలో 10 ఎకరాలు, నిమ్మాడలో 3 ఎకరాలు, పెద్దబమ్మిడిలో 3 ఎకరాలు, రాజపురం సమీపంలో 2 ఎకరాలలో కనీసం పంటలు కూడా పండించకుండా చేశారు. ఫలితంగా అవి బీడు భూములుగా మారుతున్న పరిస్థితి!

Read more RELATED
Recommended to you

Latest news