టాలీవుడ్‌లో మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివనే అని చెప్పొచ్చు. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ..తన ప్రతీ సినిమాలో చక్కటి కథను ఎంచుకుని సమాజానికి సందేశం కూడా అందిస్తు్న్నారు. స్టోరిలో తనదైన మార్క్ నేపథ్యాన్ని ఎంచుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పొందు పరిచి విజయాలను తన సొంతం చేసుకుంటున్నారు కొరటాల శివ.
కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ నెల 29 న ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ కానున్నాయి. దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతి, నక్సలిజం నేపథ్యం రెండిటినీ లింక్ చేస్తూ స్టోరి ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
ఈ సంగతులు పక్కనబెడితే..ఈ సినిమా స్టోరి చాలా పెద్దదని తాజా ఇంటర్వ్యూలో కొరటాల శివ పేర్కొన్నారు. ఆ ప్రకారం..సినిమా రన్ టైమ్ కూడా లార్జ్ స్కేల్ యే అని వార్తలొస్తున్నాయి.కొరటాల శివ గత చిత్రాలు ‘జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను’.. రన్ టైమ్ 170 నిమిషాల వరకు ఉంది. అనగా 2 గంటల 46 నిమిషాలు.
‘ఆచార్య’ పిక్చర్ కూడా టోటల్ రన్ టైం 166 నిమిషాలకు లాక్ అయినట్లు టాక్. అనగా..2 గంటల 46 నిమిషాల పాటు సినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసినట్లు వినికిడి. పిక్చర్ రన్ టైమ్ పెరగడానికి భారీ తారగణంతో పాటు స్టార్ హీరోలు కారణమవడం, స్టోరియే పెద్దగా ఉండటం కారణాలు కావచ్చు.
‘ధర్మస్థలి’ నేపథ్యంతో పాటు నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను క్లియర్ కట్ గా డిఫైన్ చేసి రెండింటినీ లింక్ చేసేందుకు చాలా కష్టపడ్డారట దర్శకులు కొరటాల శివ. కొణిదెల ఎంటర్ టైన్మెంట్స్– మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.