ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి లేదంటే అనవసరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి డ్రింక్స్ వంటివి తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఇంత వేడిలో చల్లటి కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది.
పైగా దాహం కూడా తీరినట్టే ఉంటుంది. కానీ వీటి వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందని.. సమ్మర్ లో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల కలిగే సమస్యల గురించి చూసారంటే వీటి జోలికి వెళ్లరు.
బరువు పెరగడం:
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి అని ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక గ్లాసు కూల్ డ్రింక్ లో ఎనిమిది నుండి పది టీ స్పూన్ల పంచదార ఉంటుంది. ఒక గ్లాసు కూల్ డ్రింక్ లో 150 కేలరీలు ఉంటాయి. ఇన్ని కేలరీలు తీసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు.
ఫ్యాటి లివర్ సమస్యలు:
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా కలిగే అవకాశం ఉంది. వీటిలో ఫ్రక్టోస్ మాత్రం లివర్ లో స్టోర్ అయిపోతాయి దీనివల్ల లివర్ కి ఇబ్బంది కలుగుతుంది.
పంటి సమస్యలు వస్తాయి:
కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫరస్ ఉంటుంది ఇది పంటిని డ్యామేజ్ చేస్తుంది ఇలా కూల్ డ్రింక్స్ ని తాగడం వల్ల వేసవిలో ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది.