హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో..ఇతర భాషల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ చేశాడు. అయితే, తెలుగులో ఈయన నటించిన సినిమాలు మాత్రం క్లాసిక్స్ గానే ఉండిపోయాయని చెప్పొచ్చు. ఇటీవల సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ పిక్చర్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఈ క్రమంలోనే సిద్ధార్థ్ ప్రజెంట్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తు్న్నాడు. కాగా, మంగళవారం సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా ఇటకీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ వారు సిద్ధార్థ్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు . ఆయన హీరోగా మూడు భాషల్లో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రొడక్షన్ నెం.4 పేరిట పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సంస్థకు ఇది నాలుగో చిత్రం. కాగా, దీనిని ఎస్ యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సిద్ధార్థ్ చాలా కొత్తగా కనిపిస్తుండగా, సినిమా స్టోరి వెరీ ప్రామిసింగ్ అన్న సంగతి పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు. సినిమాకు క్లాసికల్ స్టోరి కుదిరిందని, తమిళనాడులోని పళనిలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు. చూడాలి మరి..ఈ చిత్రంతోనైనా తెలుగులో సిద్ధార్థ్ సరైన విజయం అందుకుంటారో లేదో..
https://www.instagram.com/p/CchiBHTvBYs/?utm_source=ig_embed&ig_rid=da125c01-7d6d-470d-b9d6-d8544b1137de