ఆచార్య సాంగ్: చిరంజీవి స్టెప్పులతో లాహే లాహే…

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా నుండి లాహే లాహే అంటూ పాట రిలీజైంది. ఇదివరకిచ్చిన ప్రోమోలో చిరంజీవి స్టైలిష్ స్టెప్పులతో చిన్నపాటి వీడియోని రిలీజ్ చేసారు. తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటలో కాజల్ కనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన ఆచర్య అప్డేట్లలో కాజల్ ఒక్కసారి కూడా కనిపించలేదు. మొదటిసారిగా డైరెక్టుగా పాటలోనే కనిపించింది. అది కూడా స్టెప్పులేస్తూ..

పాట వింటుంటే చాలా కొత్తగా ఉందనిపిస్తుంది. శివుడి లక్షణాలను హీరోయిజానికి మ్యాచ్ చేస్తూ భార్యా భర్తల మధ్య బంధాన్ని చెబుతున్నట్టుగా ఉంది. మధ్యలో చిరంజీవి స్టెప్పులు ఊపు తెప్పిస్తాయి. పాట మొత్తంలో అలాంటి స్టెప్పులు ఇంకా రెండు మూడు ఉన్నాయై అర్థం అవుతుంది. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన హీరోయిన్ సంగీత, పాట పాడుతూ, స్టెప్పులు వేస్తూ కనిపించింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ పాటని హారికా నారాయణ్, సాహితి గారపాటి ఆలపించారు.

Read more RELATED
Recommended to you

Latest news