చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆచార్య టీజర్ ఆరోజేనట…

-

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు దర్శకుడు కొరటాల శివ. తాను తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా టీజర్ ఈ నెల 29 అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. నిజానికి నిన్న చిరంజీవి దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. అలా ప్రకటించడానికి గాను ఫన్నీగా ఒక మీమ్ చేయడం సంచలనంగా మారింది.

టీజర్ అప్డేట్ ఇవ్వకపోతే తనే లీక్ చేసేస్తా అని కొరటాల శివని చిరంజీవి బెదిరించడం దానికి కొరటాలశివ లేదండి రేపు ఉదయం అప్డేట్ చేస్తాను అని చెప్పటం కాస్త ఆసక్తికరంగా మారింది.. రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద మరింత ఆసక్తి నెలకొని ఉంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. బహుశ టీజర్లో ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news