ఒకరితో రిలేషన్ షిప్ ఏర్పర్చుకోవాలంటే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి..

-

రిలేషన్ షిప్.. ఎమోషనల్ బాండింగ్.. బంధం కోసం అర్రులు చాచేవారు మానసికంగా తమ బాధను తీర్చుకోవడం కోసమే అని చాలా మంది అభిప్రాయం. ఐతే అది తప్పు కాదు కూడా. ఒంటరిగా ఉండలేక తమకో తోడు కావాలనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉంటారు. నేనెవరి మీద ఆధారపడను. నాకలాంటి అవసరమే రాదు అని చెప్పేవాళ్లని నమ్మకండి. ఐతే రిలేషన్ షిప్ లోకి దిగాలనుకున్నవారు కొన్ని విషయాలని దృష్టిలో ఉంచుకోవాలి.

ముందుగా, అవతలి వారి గతం గురించి వదిలిపెట్టండి. అంతేకాదు, మీ గత భాగస్వామితో మీ ప్రస్తుత భాగస్వామిని పోల్చవద్దు. అది మీ బంధానికే మంచిది కాదు.

మీ భాగస్వామి అద్భుతమైన వ్యక్తే కావచ్చు. ఆ అద్భుతమైన వ్యక్తి మీతో అద్భుతంగా ఉండాలన్న రూల్ లేదు.

మీకోసం ఇతరులలో మార్పు రావాలని కోరుకోవద్దు. మీరు వారి జీవితంలోకి రాకముందు ఎలా ఉన్నారో అలానే స్వీకరించండి. మార్పు రావాలని కోరుకుంటే మీకు ఆశాభంగం తప్పదు.

మీ జీవితంలోకి వచ్చేవారు ఎప్పటికీ మీతో పాటే ఉండాలని అనుకోవద్దు. మీ జీవితంలోకి ఎలా వచ్చారో అలా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వారికి ప్లేస్ ఇవ్వండి. అది మీ ఇద్దరికీ చాలా మంచిది.

ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ ఫెక్ట్ కాదు. ఏ ఇద్దరు పర్ఫెక్ట్ మనుషులు కూడా పర్ఫెక్ట్ భాగస్వామ్యాన్ని ఏర్పర్చలేరు. అందుకే పర్ఫెక్ట్ ఉండడానికి ప్రయత్నించకండి. అది సాధ్యం కాదు. ప్రతీవారిలో తప్పులుంటాయి. కొన్నింటిని వదిలిపెడుతూ వెళ్ళకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు.

Read more RELATED
Recommended to you

Latest news