భారతదేశంలో వివిధ రంగాల రంగం 1947 సాధించిన విజయాలు..

-

మన భారత దేశ చరిత్ర గురించి చెప్పాలంటే మాటలు చాలవు..1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే..1947 నుంచి దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశం. స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది..అప్పటి నుంచి ఇప్పటివరకు సాదించిన విజయాల గురించి ఇప్పుడు వివరంగా చుద్దాము..

the tricolour flag of Independent India - Indian Flag
the tricolour flag of Independent India – Indian Flag

నాటి గాంధీ, నెహ్రూ నుంచి.. నేటి మోదీ​ వరకు.. ఈ పుడమి ఎందరో గొప్ప నేతలను అందించింది. అటు క్రీడల్లోనూ ఎందరో మట్టిలో మాణిక్యాలు ఉద్భవించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఇప్పటివరకు భారత్​ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పి, దేశానికే గర్వకారణంగా నిలిచిన పలువురు క్రీడాకారులు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వారి మరపురాని విజయాలను ఓసారి గుర్తుచేసుకుందాం..

క్రికెట్​:

భారత్​లో క్రికెట్​ అంటే ఓ ఆట కాదు.. ఓ మతం. ఈ క్రీడపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘క్రికెట్​ ఈజ్​ మై రిలీజియన్​.. సచిన్​ ఈజ్​ మై గాడ్​’ అన్న నినాదాలు దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి..మన దేశంలో ఆదరణ మొదలైంది మాత్రం 1983 ప్రపంచకప్​ తర్వాతే అని చెప్పుకోవాలి. కపిల్​ దేవ్​ సారథ్యంలో టీమ్​ఇండియా ప్రపంచకప్​ను ముద్దాడి.. ప్రపంచానికి భారత్​ సత్తాను చాటిచెప్పింది…ఆ తర్వాత ధోని సేన 2007లో టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టీ20ల్లో తొలి ప్రపంచకప్​ అదే..

హాకీ:

స్వతంత్ర భారతంలోను విజయాల పరంపరను కొనసాగించింది హాకీ టీమ్​. 1948 లండన్​ ఒలింపిక్స్​ ఫైనల్​లో గ్రేట్​ బ్రిటన్​పై 4-0 తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
1952 హెల్సింకీ ఒలింపిక్స్​లో ప్రతికూల వాతవరణాన్ని తట్టుకుని మరీ అఖండ విజయాన్ని నమోదు చేసింది భారత బృందం..

1956 మెల్​బోర్న్​లోనూ జట్టు పసిడి గెలిచింది. అయితే ఆ టోర్నీలో 5 మ్యాచ్​లు ఆడిన టీమ్​ఇండియా.. ఏ పోరులోనూ ప్రత్యర్థిని ఖాతా కూడా తెరవనివ్వలేదు. సింగపూర్​(6-0), అఫ్గానిస్థాన్​(14-0), అమెరికా(16-0), జర్మనీ(1-0), పాకిస్థాన్​(1-0)తేడాతో గెలిచి కప్​ను దక్కించుకుంది.
1960 ఒలింపిక్స్​లో భారత్​ రికార్డుకు బ్రేక్​ పడింది. అప్పటివరకు వరుసగా 6 పసిడి పతకాలు సాధించిన టీమ్​ఇండియా.. ఆ ఒలింపిక్స్​లో వెనకడుగు వేసింది. పాకిస్థాన్​కు పసిడి దక్కింది. అయితే 1964 టోక్యో ఒలింపిక్స్​లో తిరిగి స్వర్ణాన్ని అందుకుంది పురుషుల హాకీ జట్టు. పాకిస్థాన్​తో జరిగిన ఫైనల్​లో 1-0 తేడాతో విజయం సాధించింది.

1980 మాస్కో ఒలింపిక్స్​లో స్వర్ణం భారత్​కు ఎంతో ప్రత్యేకం. 1964 తర్వాత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న భారత జట్టు వాటన్నింటినీ అదిగమించి 1980లో సత్తా చాటింది.ఆ తర్వాత హాకీలో భారత్​ స్థానం పడిపోయింది. అప్పటివరకు అధిపత్యాన్ని కొనసాగించి ఒక్కసారిగా వెనకపడిపోయింది. అయితే ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో హాకీ జట్టు చెలరేగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత పురుషుల జట్టు కాంస్యం దక్కించుకుంది..

జావెలిన్​ త్రో..

2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో షూటర్​ అభినవ్​ బింద్రా చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో భారత్​కు తొలి పసిడిని అందించాడు. బింద్రా గెలుపుతో అనేకమంది యువత షూటింగ్​వైపు అడుగులు వేశారు.ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​ అథ్లెటిక్స్ విభాగంలో టీమ్​ఇండియా ‘పసిడి’ ఆకలి తీర్చేశాడు అథ్లెట్​ నీరజ్​ చోప్డా. జావెలిన్​ త్రో ఫైనల్​లో 87.58మీటర్లు వేసి ‘నీరజ్​.. నీకు సలాం’ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఆ త్రో వేసిన వెంటనే నీరజ్​ ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం..పారాలింపిక్స్​లోనూ భారత్​ అద్భుత ప్రదర్శనలు చేసింది. జావెలిన్​ త్రోలో దేవేంద్ర జజారియా రెండుసార్లు స్వర్ణం(2004,2016) సాధించాడు. ఇతడితో పాటు రాజేంద్రసింగ్, గిరీష నాగరాజె గౌడ, మరియప్ప తంగవేలు, దేవేంద్ర జజారియా, దీపా మాలిక్, వరుణ్ సింగ్ భాటి విశ్వక్రీడల్లో పతకాలతో చెలరేగారు. భారత్ ఘనతను పదింతలు పెరిగెలా చేసింది..

ఈ 75 ఏళ్లలో సైన్స్ లో భారత్ సృష్టించిన ఘనతలు..

ప్రపంచంలోని కళ్లా నోబెల్ బహుమతులు చాలా గొప్పవి..1947 నుంచి ఇప్పటి వరకూ భారత దేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో ఇప్పుడు చుద్దాము. ఎందరో ప్రముఖులు భారత్‌కు కీర్తి ప్రతిష్టలు అందించి పెట్టారు. విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు. భారతీయులతోపాటు, భారత సంతతికి చెందిన వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు..
స్వాతంత్రం రావడానికి ముందు సాహిత్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్, ఫిజిక్స్‌లో సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మదర్ థెరిసా, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి వంటి వారు నోబెల్ గెలుచుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం నుంచి నోబెల్ బహుమతి గెలుచుకుని ప్రపంచ వేదికలపై సత్తా చాటిన మహనీయులను గుర్తు చేసుకుందాము..

సేవకు మారు పేరు మథర్ థెరిస్సా..సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా మదర్ థెరిసా చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ బహుమతి కమిటీ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందించింది…
స్వాతంత్ర భారతంలో దేశానికి మరో నోబెల్ బహుమతి సాధించిపెట్టిన ఆర్థిక నిపుణుడు, తత్వ శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఆయనకు 1998లో మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థికశాస్త్రము, పేదరికానికి గల కారణాలు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది..
నోబెల్ బహుమతి సాధించిన మరో భారతీయుడు కైలాష్ సత్యార్థి. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు గాను, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2014లో మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు..
మన దేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్లిన మరికొంతమంది ప్రముఖులకు కూడా నోబెల్ బహుమతులు దక్కాయి. హర్ గోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీకి నోబెల్ దక్కింది..

శరీర ధర్మశాస్త్రం, మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయ సంతతి వ్యక్తి హర గోవింద్ ఖొరానా. ఆయన భారత్‌లో జన్మించినప్పటికీ అమెరికాలో 1968లో నోబెల్ బహుమతి సాధించారు..
నోబెల్ బహుమతి అందుకున్న భారత సంతతి వ్యక్తుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయనకు భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్ బహుమతి దక్కింది…

నోబెల్ బహుమతి పొందిన మరో భారత సంతతి వ్యక్తి వెంకట రామన్ రామకృష్ణన్ అలియాస్ వెంకీ రామకృష్ణన్. జీవ రసాయన శాస్త్రంలో ఆయనకు 2009లో నోబెల్ బహుమతి లభించింది..
నోబెల్ బహుమతి పొందిన మరో భారతీయుడు అభిజిత్ వినాయక్ బెనర్జీ. ఆయనకు 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది..

దేశం నుంచి నోబెల్ అందుకున్న మరో మహనీయుడు 14వ దలైలామా. టిబెట్‌లో జన్మించిన ఆయన ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 1959 నుంచి ఇక్కడే ఉంటున్న ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది..

వివిధ సూచికలలో భారత్ స్థానం..

వివిధ ఇండెక్స్‌లలో 2022కి భారతదేశం యొక్క ర్యాంక్ ల జాబితా. ఈ ప్రత్యేక విభాగంలో వివిధ సూచికలు 2022కి భారతదేశ ర్యాంకింగ్‌ను మీకు అందించబోతున్నాము. మీ అందరికీ తెలిసినట్లుగా, ప్రతి సంవత్సరం అనేక అంతర్జాతీయ సంస్థలు వివిధ సూచికల అంతర్జాతీయ జాబితాను ప్రచురిస్థాయి. ఈ సూచికలన్నీ సామాజిక, ఆర్థిక & రాజకీయాలకు సంబందించినవి..వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

ఇండెక్స్‌లో భారత్ ర్యాంకింగ్ గతేడాది 142వ ర్యాంక్ నుంచి 150వ స్థానానికి పడిపోయింది.
నేపాల్ మినహా భారతదేశ పొరుగు దేశాల ర్యాంకింగ్ కూడా ఇండెక్స్ ప్లేస్‌తో పడిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నేపాల్ 30 పాయింట్లు ఎగబాకి 76వ స్థానంలో నిలిచింది.
పాకిస్థాన్ 157వ స్థానంలో, శ్రీలంక 146వ స్థానంలో, బంగ్లాదేశ్ 162వ స్థానంలో, మేన్మార్ 176వ స్థానంలో నిలిచాయి.

నార్వే (1వ స్థానం) డెన్మార్క్ (2వ), స్వీడన్ (3వ), ఎస్టోనియా (4వ), ఫిన్‌లాండ్ (5వ) అగ్రస్థానాలను కైవసం చేసుకోగా, 180 దేశాలు మరియు భూభాగాల జాబితాలో ఉత్తర కొరియా అట్టడుగున కొనసాగింది.
గత ఏడాది 150వ స్థానంలో ఉన్న రష్యా 155వ స్థానంలో నిలవగా, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్‌తో చైనా రెండు స్థానాలు ఎగబాకి 175వ స్థానంలో నిలిచింది. గతేడాది చైనా 177వ స్థానంలో నిలిచింది.
ఫిబ్రవరి చివరిలో రష్యా (155వ) ఉక్రెయిన్‌పై దాడి (106వ) ఈ ప్రక్రియను ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే భౌతిక సంఘర్షణకు ముందు ప్రచార యుద్ధం జరిగింది.

నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ & క్లైమేట్ ఇండెక్స్ (SECI) రౌండ్ Iని ప్రారంభించింది. స్టేట్ ఎనర్జీ & క్లైమేట్ ఇండెక్స్ (SECI) రౌండ్ I రాష్ట్రాల పనితీరును 6 పారామితులపై ర్యాంక్ చేస్తుంది, అవి, (1) డిస్కమ్ పనితీరు (2) యాక్సెస్, అందుబాటు మరియు శక్తి యొక్క విశ్వసనీయత (3) క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ (4) శక్తి సామర్థ్యం (5) పర్యావరణ స్థిరత్వం; మరియు (6) కొత్త కార్యక్రమాలు.

ఇకపోతే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2021 లేదా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2021లో భారతదేశం 120వ స్థానంలో నిలిచింది..

భారతదేశం తన మొత్తం IP స్కోర్‌ను 38.4 శాతం నుండి 38.6 శాతానికి మెరుగుపరుచుకుంది మరియు అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో దేశం 55 దేశాలలో 43వ స్థానంలో ఉంది.
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం, 2021 డెమోక్రసీ ఇండెక్స్ యొక్క గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారతదేశం 46వ స్థానంలో ఉంది..

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2021 ప్రకారం, 2021లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ముంబై 5వ స్థానంలో, బెంగళూరు 10వ స్థానంలో నిలిచాయి. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 58 దేశాల్లోని 404 నగరాల్లో ఢిల్లీ మరియు పూణే 11వ మరియు 21వ స్థానంలో ఉన్నాయి..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ నికర విలువ $88.5 బిలియన్‌లకు చేరుకుంది, 8 ఫిబ్రవరి 2022 నాటికి ముఖేష్ అంబానీ యొక్క $87.9 బిలియన్‌లను అధిగమించి ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు. అతని వ్యక్తిగత సంపదలో దాదాపు $12 బిలియన్ల పెరుగుదలతో, అతను 10వ బిగ్ షార్ట్ అయ్యాడు.

కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM)లో అగ్రగామిగా ఉన్న సేల్స్‌ఫోర్స్ గ్లోబల్ డిజిటల్ స్కిల్స్ ఇండెక్స్ 2022ని ప్రచురించింది, ఇది పెరుగుతున్న గ్లోబల్ డిజిటల్ స్కిల్స్ సంక్షోభం మరియు చర్య యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశం 100కి 63 స్కోర్ చేసింది..
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) 2021ని విడుదల చేసింది, దీనిలో భారతదేశం 85వ స్థానంలో (స్కోరు 40) నిలిచింది..

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) తన వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్ – ట్రెండ్స్ 2022 (WESO ట్రెండ్స్) నివేదికను విడుదల చేసింది. నివేదిక 2022 మరియు 2023కి సంబంధించిన సమగ్ర కార్మిక మార్కెట్ అంచనాలను విశ్లేషిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా కార్మిక మార్కెట్ పునరుద్ధరణ ఎలా జరిగిందో అంచనా వేస్తుంది..

ఆక్స్‌ఫామ్ ఇండియా, “అసమానత చంపేస్తుంది” నివేదిక ప్రకారం, 2021లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల సంపద రికార్డు స్థాయికి చేరుకుంది. నివేదికలో, భారతదేశంలోని టాప్ 10 మంది వ్యక్తులు 57 మందిని కలిగి ఉన్నందున, భారతదేశాన్ని ‘చాలా అసమానమైన’ దేశంగా అభివర్ణించారు..
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా ఉంది..సమయ పనితీరులో 8వ స్థానంలో నిలిచింది..

శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM)ని అమలు చేస్తున్న 34 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ 1వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, గుజరాత్‌లు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. 295 క్లస్టర్ల ర్యాంకింగ్‌లో తెలంగాణలోని సంగారెడ్డిలోని ర్యాకల్ క్లస్టర్, కామారెడ్డికి చెందిన జుక్కల్ క్లస్టర్‌లు వరుసగా 1వ, 2వ స్థానాల్లో నిలిచాయి. మిజోరాంలోని ఐబాక్ క్లస్టర్ 3వ స్థానంలో నిలిచింది..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదాయాలు, లాభాలు మరియు మార్కెట్ విలువ పరంగా భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్, 2021 Wizikey న్యూస్ స్కోర్ ర్యాంకింగ్‌లో భారతదేశంలో అత్యధికంగా మీడియాలో కనిపించే కార్పొరేట్‌గా అగ్రస్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో ఉండగా, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ మరియు టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశ జాబితాలో హెచ్‌డిఎఫ్‌సి ఆరవ స్థానంలో ఉండగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్, మారుతీ సుజుకి ఇండియా, వొడాఫోన్ ఐడియా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి..

డేటా అనలిటిక్స్ కంపెనీ YouGov నిర్వహించిన సర్వేలో, ప్రపంచంలోని అత్యధికంగా ఆరాధించబడే 20 మంది పురుషుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 8వ స్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లి కంటే ప్రధాని మోదీ ముందున్నారు..

భారతదేశ ఆర్థిక మంత్రి (FM), నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ యొక్క ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2021 లేదా ఫోర్బ్స్ యొక్క 18వ ఎడిషన్ ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 37వ స్థానంలో ఉన్నారు. ఆమె వరుసగా 3వ సంవత్సరం జాబితాలో చోటు దక్కించుకుంది..

ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) కింద గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులతో ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది, తమిళనాడు మరియు గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి..
భారత్ లో అతి పెద్ద ఆర్థిక విజయాలు..

ఆర్థిక పరమైన అంశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గడిచిన కాలంలో బ్యాంకింగ్ సెక్టార్‌లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి.

1947 నుండి సాధించిన విజయాలు మన దేశ సామర్థ్యానికి నిదర్శనాలు. పైన పేర్కొన్నవే కాకుండా సాంకేతిక రంగంలో, పరిశ్రామికంగా, సేవల రంగంలో క్రీడా రంగంలో, సినిమా రంగంలో, అందాల పోటీల్లో, రవాణా వ్యవస్థలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో భారతదేశం రికార్డులు బద్దలుకొడుతూ.. తన చరిత్రను తిరగ రాస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలలో భారత దేశం ఎన్నో ఘనతలను సాధించింది..అభివృద్ధి లో మన దేశం ఇతర దేశాల తో పోటీ పడుతుందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు..

భరత మాత ముద్దు బిడ్డలుగా మన దేశ గౌరవాన్ని పెంపొందించేందుకు కలిసిగట్టుగా ముందుకు వెళదాం..దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాము…జై హింద్..

Read more RELATED
Recommended to you

Latest news