ఆదిలాబాద్​ జిల్లాలో దారుణం… మహిళపై యాసిడ్ దాడి

మన దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా…. మహిళలపై దాడులు తగ్గడం లేదు. ఏదో ఓ మూలన మహిళలపై లైంగిక దాడులు, హత్యలు చేస్తూనే ఉన్నారు కొందరు దుర్మార్గులు. అయితే… తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

ఉట్నూరు మండలం లక్కారం కేబీనగర్‌ లో ఓ మహిలపై దుండగుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. మహిళపై యాసిడ్ పోసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు ఆ నిందితుడు. ప్రస్తుతం బాధితురాలు ఊట్నూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ఘటన ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఏదైనా ప్రేమ వ్య వహారమా.. లేక ఇంకే దైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే… ఈ ఘటన వివరాలు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.