ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా వరకు కంపెనీలు తమ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసేందుకు వీలు కల్పించాయి. ఇక మన దేశంలోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆ అవకాశాన్ని అందిస్తున్నాయి. అయితే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని యాక్ట్ ఫైబర్ నెట్ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అదేమిటంటే…
యాక్ట్ ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడేవారు తమ ప్లాన్‌ను ఉచితంగా 300 ఎంబీపీఎస్ స్పీడ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక ప్లాన్ అప్‌గ్రేడ్ అయ్యాక అన్‌లిమిటెడ్ డేటా కూడా వస్తుంది. అయితే ఇందుకు గాను కస్టమర్లు ఎలాంటి అదనపు రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారమే రెంటల్ చెల్లించవచ్చు. ఇక కేవలం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని యాక్ట్ ఫైబర్ నెట్ తెలిపింది. యాక్ట్ ఫైబర్ నెట్ ఆఫర్‌ను పొందాలంటే ఇలా చేయాలి…
స్టెప్: 1: ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్‌లో కస్టమర్లు యాక్ట్ ఫైబర్‌నెట్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్: 2: హోం పేజీలో కనిపించే క్లిక్ టు బూస్ట్ అనే బ్యానర్‌ను క్లిక్ చేయాలి.
స్టెప్: 3: కస్టమర్లు ప్రస్తుతం వాడుతున్న ప్లాన్ స్పీడ్ 300 ఎంబీపీఎస్‌కు మారుతుంది. అలాగే మార్చి 31వ తేదీ వరకు ఈ స్పీడ్ కొనసాగుతుంది. అప్పటి వరకు అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది.
అయితే ఈ ప్లాన్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉందా, లేక ఎంపిక చేసిన వారికేనా అన్న వివరాలను ఆ కంపెనీ వెల్లడించలేదు. కానీ కస్టమర్లు ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. వస్తే హైస్సీడ్ ఇంటర్నెట్ విత్ అన్‌లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చు..!