అటు తిరిగి ఇటు తిరిగి జగన్ కి మేలు చేస్తూ చంద్రబాబు కి భారీ డ్యామేజ్ చేసిన పవన్ కల్యాణ్ ?

-

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి ముఖ్యపాత్ర పోషించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు యొక్క రిజల్ట్ బాగా కనపడింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా మరియు జనసేన పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయడంతో ఉభయగోదావరి జిల్లాల్లో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా చాలావరకు బెనిఫిట్ పొందింది వైసిపి పార్టీ. ముందు నుండి జగన్ తన పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అంటూ  బలమైన వాదన ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. Image result for pawan kalyan chandrababu jaganదీంతో జగన్ ఆ విధంగా టిడిపి మరియు జనసేన పార్టీ ఓటు బ్యాంకు చీల్చడం వల్ల రాష్ట్రంలో 151 సీట్లు పండు కోవడం జరిగింది. ఒకవేళ టిడిపి మరి జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా 130 లోపు మాత్రమే వైసీపీ పార్టీ స్థానాలు గెలిచేది అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మళ్లీ స్థానిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో చేతులు కలపడం జరిగింది. అయితే ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయిన, కొన్ని చోట్ల మాత్రం ప్రభావం చూపే అవకాశముంది. కాకపోతే గెలిచెంత సీన్ మాత్రం రాదు. కానీ టీడీపీకి పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు, జనసేన-బీజేపీ కూటమికు కాస్త పడుతుంది.

 

ముఖ్యంగా జనసేన పార్టీ కాస్తోకూస్తో ప్రభావం చూపించే గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి భారీ నష్టం జరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో రాజకీయాలలో అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీతో చేతులు కలిపి జగన్ కు మేలు చేస్తూనే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, టోటల్‌గా జగన్‌కు లబ్ది చేకూరడం వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది జగన్ పార్టీ అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news