దారిదోపిడీలకు పాల్పడిన కానిస్టేబుళ్ల పై చర్యలు…!

-

చిత్తూరు జిల్లాలో కొందరు పోలీసులు గాడి తప్పారు. వృత్తి ధర్మం మరిచిపోయారు. వారు చేస్తున్న పనుల కారణంగా పోలీస్‌ శాఖకే మచ్చ తెచ్చి పెడుతున్నారు. రామసముద్రం వద్ద టామోటో లోడ్‌తో వెళ్తున్న వెహికిల్‌ డ్రైవర్‌ దగ్గర కానిస్టేబుల్‌ 50 రూపాయలు లంచం డిమాండ్‌ చేస్తున్న విజువల్స్‌ వైరల్‌గా మారింది. దీంతో అతడిని వీఆర్‌కు పంపారు అధికారులు.

తడుకుపేట చెక్‌పోస్టు దగ్గర వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు ఎస్పీవోలను పోలీసులే అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఇదంతా ఓ ఎత్తు అయితే పోలీసులే దారిదోపిడీకి దిగడం మరింత కలకలానికి కారణమైంది. ముగ్గురు కానిస్టేబుళ్లు.. స్నేహితులతో కలిసి వడమాల పేట- చెన్నై హైవేలో దారిదోపిడీకి దిగారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దారిదోపిడీకి పాల్పడుతున్న కానిస్టేబుళ్లను అరెస్ట్‌ చేశారు. ఈ మధ్య కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో వంద డయల్‌ చేస్తే పోలీసులు రావడం లేదు. వంద కొడితే పోలీసులు వస్తున్నారని చిత్తూరులో సెటైర్లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news