ఒకే అధికారి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల పట్టు..కారణం ఇదే…!

-

ఓ తహశీల్దారు పోస్టు.. రెండు నియోజకవర్గాల మధ్య తగువుగా మారింది.అసలే ఇది ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్న సమయం. అనుకూలురైన అధికారుల కోసం ప్రజాప్రతినిధులు దుర్బిణీ పెట్టి వెతుకుతున్నారు. మాట వినేవారు వస్తే క్షేత్రస్థాయిలో పనులు సాఫీగా సాగిపోతాయని భావిస్తున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఈ క్రమంలో ఒకే అధికారి కోసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టుబట్టడం అనంతపురం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కల్యాణదుర్గం తహశీల్దారును జనరల్‌ బదిలీల్లో భాగంగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఇక్కడ తన మాట వినే ఎమ్మార్వోను తీసుకురావాలని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ ప్రయత్నిస్తున్నారట. ఇంతలో తిరుమలరెడ్డి ని కల్యాణదుర్గం తహశీల్దారుగా నియమించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారట. తిరుమలరెడ్డిని జాయిన్‌ కావొద్దని చెప్పారట. దీంతో ఆయన డ్యూటీలో చేరలేదు. అయితే.. కదిరిలో పనిచేస్తున్న మారుతిప్రసాద్‌ అనే మరో తహశీల్దారుకు ఇక్కడకు పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. కల్యాణదుర్గంలో ఛార్జ్‌ తీసుకునేందుకు మారుతిప్రసాద్‌ రావడం లేదు. ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ కోరినా కదిరిలో రిలీవ్‌ కావడానికి ఇష్ట పడటం లేదట. పైగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఈ విషయం తెలిసి ఫైర్‌ అయ్యారట. తన నియోజకవర్గంలో మరో తహశీల్దారుకు పోస్టింగ్‌ ఇవ్వకుండా మారుతిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారట.తొలుత కల్యాణదుర్గం రావడానికి ఆసక్తి చూపించిన మారుతిప్రసాద్‌ ఎమ్మెల్యే ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి ఉంటుందనే ప్రచారం జోరందుకోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది..దీంతో ఈ పంచాయితీ ఎక్కడిది అక్కడే ఆగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news