కొంతమందితో కాసేపు కూర్చుంటే ఎంతో బాగుంటుంది. అలాంటి వాళ్ళతో కాసేపు సమయాన్ని గడిపితే బాధలన్నీ కూడా మర్చిపోతాము అయితే కొంత మంది వలన మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఈ మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆచార్య చాణక్య అన్నారు ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా మనం లైఫ్ లో ముందుకు వెళ్తాము.
మన లైఫ్ లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండగలము. అయితే చాణక్య చాణక్య నీతిలో ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు మరి వాళ్ళు ఎవరంటే.. స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు మనకి కలుగుతుంది స్వార్ధపరులకు దూరంగా ఉండాలని చాణక్య చెప్పారు స్వార్థపరులకి దూరంగా ఉండకపోతే వాళ్లు మనల్ని వారికి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటారు. ఆఖరికి మనల్ని చిక్కుల్లో పడేసి వెళ్ళిపోతారు.
కోపం ఉండేవాళ్ళకి కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే కోపంతో ఉండే వాళ్ళు మనకి బాగా హాని చేస్తూ ఉంటారు మన మనసు ని కూడా బాధ పెడతారు. అలానే ఎక్కువగా పొగిడే వాళ్లకి దూరంగా ఉండాలి. మన ముందు పొగిడే వాళ్ళు మన వెనక మన గురించే మాట్లాడుకుంటారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ మూడు వ్యక్తులతో మనం ఉన్నట్లయితే మనమే చిక్కుల్లో పడతాము ఇలాంటి వాళ్ళకి దూరం పాటించడమే మేలు అప్పుడు ఎలాంటి బాధ ఉండదు.