సీనియర్ నటుడు శరత్ బాబు శుక్రవారం రోజున తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బెంగళూరులో చికిత్స పొందుతున్న ఆయనని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ కి తీసుకువచ్చారు. నగరంలోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శరత్ బాబు ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది.
ఆయనకి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయనకు శరీరం అంతా ఇన్ఫెక్షన్ వ్యాపించిందని తెలిపారు డాక్టర్లు. మరికొద్ది గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి చెప్పలేమని వెల్లడించారు. దీంతో సాయంత్రం తర్వాత శరత్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.