లాక్ డౌన్ సమయంలో ఎందరికో అండగా నిలిచి, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుని, ఎంతోమందికి స్పూర్తినిచ్చి రియల్ హీరోగా పేరుతెచ్చుకున్నారు సోనూసూద్. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చేసిన పనులకి ప్రజలు, ప్రముఖులు, అధికారులు ఇలా అందరూ ఫిధా అయిపోయారు. అయితే ఇంత మందిని ఫిధా చేసిన సోనూసూద్ ని ఇప్పుడు ఒక ఊరు ఫిధా చేసింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఒక గిరిజనులు గ్రామం. అసలు విషయం ఏంటంటే..
I will soon come and visit you guys❤️ you will inspire the nation. 🇮🇳 https://t.co/BTARu7G07e
— sonu sood (@SonuSood) August 24, 2020
ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పూర్తితో ఒక్కో ఇంటికి రూ. 2,000 చొప్పున చందాలు సేకరించి స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేపట్టారు. దీనిపై స్పందించిన సోనూసూద్ వారికీ అభినందనలు తెలిపారు. త్వరలోనే ఏపీలో పర్యటించి వారికి కలుసుకుంటానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. మీ ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని పిలుపునిచ్చారు.