మోడీ సర్కార్ కు సినీ నటుడు సుమన్ వార్నింగ్‌ !

-

కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని బీసీ నేత, ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు. కుల గణనను చేపట్టాలని కోరుతూ ఆదివారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు నుంచి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టారు. ఒకపక్క జోరువాన కురుస్తున్నా.. బీసీలు ఐక్యంగా ఉండి.. యాత్రను జయప్రదం చేశారు.

ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ కుల గణన పై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి అని పేర్కొన్నారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి బీసీల హక్కులపై తెలియజేయాలని పేర్కొన్నారు. బీసీల అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని, కుల గణన ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ డిమాండ్ ను నెరవేర్చకుంటే రానున్న డిసెంబర్లో పార్లమెంటును ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై ఆయన స్పందిస్తూ . జగన్ పరిపాలనను తాము పరిశీలిస్తున్నామని, ప్రభుత్వానికి ఇంకా సమయం చాలా ఉందని ఆయన వెల్లడించారు. ఈ పాదయాత్రలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు, జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news