Nayanthara: ఐశ్వ‌ర్య‌రాయ్ బాట‌లో న‌య‌న్.. పెళ్లికి ముందే.. సీక్రెట్ గా మ‌రో పెండ్లి!

-

Nayanthara: ల‌వ్ బ‌ర్డ్స్ నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు కొంతకాలంగా ఇష్టానూసారంగా చెట్ట‌ప‌ట్టాలు వేసుకుని తిరిగిన విష‌యం మనందరికీ తెలుసు.. తొలుత వారిద్ద‌రూ త‌మ ల‌వ్ స్టోరీని చాలా సీక్రెట్‌గా నడిపారు. ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో నయన్- విఘ్నేష్ ల జోడీ ఎక్క‌డికి వెళ్లినా హ‌ట్ టాపిక్ గా మారింది. ఈ క్ర‌మంలో వీరిద్దరి పెళ్లి పీఠలెక్కనున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ జంట మాత్రం ఇప్పటి వరకు ఈ గుడ్‌ న్యూస్‌ చెప్పలేదు. దీంతో వారిద్ద‌రి పెండ్లి క్యాన్సిల్‌ అయిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వారిద్ద‌రి వివాహం వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాలు, నయనతార వ్యక్తిగత విష‌యాలు ఇండ‌స్ట్రీలో వైరల్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. నయనతారకు పుట్టుకతో కుజ దోషం ఉండ‌ట‌.. ఈ కార‌ణంతోనే ఇవి రోజులు పెళ్లి వాయిదా వేశార‌ట‌. దోష పరిహారం చేసుకునేంత వరకు వివాహం చేసుకోకపోవడమే మంచిదని, దోష నివారణ చర్యలో భాగంగా ఆమె ఓ చెట్టును పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. జ్యోతిష్యుల సూచన మేరకు నయన్‌ తొలుత చెట్టును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ కార్యక్రమం పూర్తికాగానే నయన్‌ జంట పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అభిషేక్‌ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు ఐశ్వర్య రాయ్‌ కూడా ఇలాగే చేసింద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news