కన్నడ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిషమైన నటి దివ్య రమ్యగా ప్రేక్షకులకు పరిచయం అయితే ఎక్కువగా కన్నడ తమిళ చిత్రాలను చేసిన దివ్య తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఉత్తర్కెక్కిన సూర్య సన్నాఫ్ కృష్ణతో మంచి పేరు సంపాదించుకుంది.. సినిమాల్లో నటిస్తూనే 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈమె 2013 బై ఎలక్షన్స్ లో కర్ణాటకలోని మాండ్య నుంచి ఎంపీగా గెలిచింది ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్నా ఈమె తాజాగా ఉమెన్ ఫ్రీడమ్ కోసం కొన్ని వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం ఇది వైరల్‌గా మారాయి..
నటి రమ్య తాజాగా ఉమెన్ ఫ్రీడం కోసం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సందర్భంగా ఈమె హీరోయిన్స్ సమంత సాయి పల్లవి రష్మిక దీపికా పదుకొనే వంటి ఎందరో హీరోయిన్ల కోసం చెప్పకు వచ్చింది.. ఎప్పుడు మహిళలపై ట్రోల్ చేయడానికి నటిజన్లో సిద్ధంగా ఉంటారని వాళ్ళ పరిస్థితిలో ఎలాంటివో కూడా అర్థం చేసుకోవాలని తెలిపింది..
అలాగే.. “సమంత విడాకులు తీసుకున్నపుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. తప్పందా తనదే అన్నట్లుగా నాగచైతన్య ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్లు చేశారు. అసలే వివాహ బంధం తెగిపోయిన బాధలో ఉన్న ఆమె పట్ల నెటిజన్లు ప్రవర్తించిన తీరు అస్సలు సరిగా లేదు. అలాగే కశ్మీర్లో అధికంగా ఉన్న ముస్లిం అతివాదులు హిందువులపై చేసిన దాడులైనా, నేడు హిందుత్వ వాదులు ముస్లింలను గోవుల పేరుతో వేధిస్తున్న దాడులైనా ఒకటే అన్నట్లుగా సాయి పల్లవి మాట్లాడితే ఆమెపైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.
ఇక రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంపైనా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. దీపికా పదుకొనే గతంలో జేఎన్‌యూ విద్యార్థులకు మద్ధతు తెలపడంపై విమర్శలతో పాటు బెదిరింపులు ఎదుర్కొంది. ప్రస్తుతం ‘పఠాన్’ మూవీలో ‘బేషరమ్ రంగ్’ పాటలో తాను ధరించిన దుస్తులపైనా ట్రోల్స్ ఎదుర్కొంటోంది… అయితే ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళలనే అందరూ ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారో తెలియటం లేదు..” అంటూ పోస్ట్ చేసింది..