సల్మాన్ నీ సందేశం నా గుండెలను తాకింది.. అక్షయ్ కుమార్

-

తాజాగా ఓ రియాలిటీ షోలో అక్షయ్ సోదరి అల్కా భాటియా తన గురించి మాట్లాడుతున్న పాత వీడియోను శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్ చేసిన సల్మాన్.. స్పెషల్ నోట్ జోడించాడు. అయితే ఈ మెసేజ్ చూసిన అక్షయ్ కుమార్ కూడా భావోద్వేగానికి గురైయ్యాడు అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే..

అక్షయ్ కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో ‘రక్షా బంధన్’ మూవీ ప్రమోషన్స్ కోసం సింగింగ్ రియాలిటీ షో ‘సూపర్ స్టార్ సింగర్ 2’లో పాల్గొన్నారు.. అప్పుడు ఆయన సోదరి అల్కా భాటియా ఈ వాయిస్ మెసేజ్‌ను పంపించింది. తనకోసం ఎప్పుడూ అండగా నిలబడ్డాడు అంటూ ఆమె ఈ వీడియో క్లిప్ లో అక్షయ్ కు థాంక్స్ చెప్పగా ఇది విన్న ఆ అక్షయ్ తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేక స్టేజ్ పైన ఏడ్చేసాడు అయితే ప్రస్తుతం ఇదే వీడియోను సల్మాన్ ఖాన్ తన ఇన్స్టా లో షేర్ చేశాడు..

అలాగే ఈ వీడియోను షేర్ చేసిన సల్మాన్ ఖాన్.. ‘ ఈ విషయాన్ని నేను అందరితో పంచుకోవాలని అనుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అక్కీ. ఈ వీడియో నిజంగా అద్భుతంగా ఉంది. ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడూ పనిచేస్తూ ఫిట్‌గా ఉండు. ఆ దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడని ఆశిస్తున్నాను బ్రదర్’ అంటూ నోట్ యాడ్ చేశాడు. దీనికి స్పందించిన అక్షయ్ కుమార్… ‘నీ సందేశం నిజంగా నా గుండెను తాకింది. మనసుకు హాయినిచ్చింది. నీకు కూడా ఆ దేవుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా.. నిత్యం వెలుగుతూనే ఉండు’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఎమోషనల్ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news