జబర్దస్త్‌కు దూరమైన నటి రోజా మళ్లీ బుల్లితెరపై ఓ స్పెషల్ ఈవెంట్ ద్వారా సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. దాన్ని చూసేయండి..
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది సీనియర్ నటి రోజా. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. అలాగే బుల్లితెర షో అయిన జబర్దస్త్‌లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.
అయితే రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల ఈ షో నుంచి తప్పుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో రోజాను ఇకపై షోల్లో కనిపించరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆమె త్వరలోనే మళ్లీ బుల్లితెరై సందడి చేయనున్నారు.
దసరా స్పెషల్ ఈవెంట్లో ఆమె కనువిందు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా, నవ్వులు పూయిస్తూ సాగింది. ఇందులో భాగంగానే రోజాను స్టేజీపై ఘనంగా సన్మానించారు. అయితే రోజా కనిపించేది ఈ ఒక్క ఎపిసోడ్ వరకేనా? ముందు ముందు స్పెషల్ ఈవెంట్స్‌లో కనిపించే ఛాన్సుందా అనేది తెలియాల్సి ఉంది.