ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్.. ఏకంగా 2.12 కోట్ల లంచంతో !

-

తెలంగాణలో మొన్న దొరికిన కీసర తహసీల్దార్ ని మించి పోయేలా మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జీ నగేష్ కోటీ పన్నెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ముందు బుక్కయ్యాడు. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జీ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. భూ వివాదంలో లంచంగా 1 కోటి 12 లక్షల లంచం తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

మాచవరంలోని ఆయన ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెక్కుతో పాటు ప్రాపర్టీ అగ్రిమెంట్ కూడా నగేష్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆడియో క్లిప్ లతో సహా నగేష్ దొరికినట్టు చెబుతున్నారు. లంచంగా కోటి 12 లక్షల డబ్బు, కోటి రూపాయల ప్రాపర్టీ నగేష్ రాయించుకున్నాడని తెలుస్తోంది. గడ్డం నగేష్ ఇంటి తో పాటు అతని బంధువులు, బినామీల ఇళ్ళలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 12 చోట్ల ఏసీబీ సోదాలు జరుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news