మన చుట్టూ పరిసరాల్లో జరిగే కొన్ని రకాల సంఘటనలను చూస్తే.. నిజంగా మన సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాదు. మనం కలలో కూడా చూడకూడదు.. అనుకునే సంఘటనలను మనం చూడాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఆ సంఘటనలకు బాధ్యులైన వారి పట్ల మనకు విపరీతమైన ఆగ్రహం, ద్వేషం కలుగుతాయి. సరిగ్గా ఇప్పుడు కూడా ఆ వీడియోను చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే…
వీడియోలో చూశారు కదా.. చిన్న పిల్లలకు కొందరు పెద్దలే స్వయంగా మద్యం తాగిస్తున్నారు. గ్లాసుల్లో పోసి మరీ ఇస్తుంటే.. పిల్లలు మద్యం తాగుతున్నారు. అంతేకాదు, తాగమని వారిని పెద్దలు ప్రోత్సహిస్తూ.. ఈలలు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. పిల్లలకు అలా మద్యం తాగిస్తున్న పెద్దలపై అందరూ మండిపడుతున్నారు.
మద్యపానం అసలు పెద్దలకే హానికరం. అలాంటిది పిల్లలకు మద్యం ఎలా తాగిస్తారు..? నిజంగానే మనం మానవ సమాజంలోనే ఉన్నామా..? అరణ్యంలో ఉన్నామా..? అన్న అనుమానం.. ఈ వీడియోను చూస్తే మనకు కలుగుతుంది. ఇలాంటి పనులు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి. ఇకపై ఈ తరహా పనులు ఎవరూ చేయకుండా ఉండేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి..!