బీచ్ లో ఎంజాయ్ చేసిన రేణూ దేశాయ్.. వద్దన్నా వీడియో తీసిన..?

-

రేణూ దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతమైన పేరు. హీరోయిన్ గా, దర్శకురాలిగా, పవన్ కల్యాణ్ మాజీ భార్యగా.. ఇలా ఒక్కోరకంగా అందరికీ తెలిసిన బ్యూటీ. బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణూ.. నటిగానే కాకుండా రైటర్ గా, డైరెక్టర్ గా తన సత్తా చాటారు. బద్రీ, జానీ ఇలా పవన్ కల్యాణ్ తో సినిమాలు తీసి ఆయణ్ని పెళ్లాడారు. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు పిల్లలు. 2012లో రేణూ, పవన్ విడాకులు తీసుకున్నారు.

అప్పటి నుంచి రేణూ దేశాయ్ సింగిల్ పేరెంట్ గా తన పిల్లలిద్దర్నీ పోషిస్తున్నారు. తరచూ వారితో వెకేషన్లకు వెళ్తూ జాలీగా గడుపుతున్నారు. తాజాగా రేణూ దేశాయ్ తన పిల్లలతో వెకేషన్ లో భాగంగా ఓ బీచ్ కు వెళ్లారు. అక్కడ ఆమె బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా ఓ వ్యక్తి తన వీడియోలు తీశారు. అది గమనించిన రేణూ దేశాయ్.. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇంతకీ రేణూ వారిస్తున్నా వీడియోలు తీసింది ఎవరంటే.. తన కూతురు ఆద్య.

బీచ్ లో రేణూ దేశాయ్ జాలీగా ఎంజాయ్ చేస్తుండగా.. ఆద్య వీడియో తీయడం స్టార్ట్ చేసింది. దాంతో ఆద్యను వీడియో తీయొద్దని చెప్పినా.. తను వీడియో షూట్ చేసింది. ఈ వీడియోకు మార్ డాలా అనే పాటను యాడ్ చేసి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో నా నిజమైన మార్ డాలా క్షణం అని క్యాప్షన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news