మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత వివేక్. కొత్త పార్టీ పెట్టకండి… బీజేపీ లోకి రావాలని ఈటల రాజేందర్ ను తానే ఒప్పించానని స్పష్టం చేశారు వివేక్. ఈటల కొత్త పార్టీ పెట్టాలని భావించారని.. కానీ తానే వద్దని చెప్పినట్లు గుర్తు చేశారు వివేక్.
బండి సంజయ్, కిషన్ రెడ్డి లు కూడా ఈటల రాజేందర్ కు భరోసా ఇచ్చారన్నారు. టిఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని నిరూపించుకున్నామనీ పేర్కొన్నారు. సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది… మనం సిద్ధంగా ఉండాలని కోరుతున్నానని చెప్పారు వివేక్. హుజురాబాద్ ఫలితం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టన్నారు. అవినీతి తో సంపాదించిన వేల కోట్లను కేసీఆర్ హుజురాబాద్ లో పంచారని అగ్రహించారు వివేక్. తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా.. బిజేపి పార్టీనే గెలుస్తుందని స్పష్టం చేశారు వివేక్. కాగా హుజూరాబాద్ ఎన్నికల్లో ఇటీవలే ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.