అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లు సైన్యంలో.. ఆ తరువాత జీవితకాలం బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల తర్వాత వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు, పెళ్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ సైనిక హోదా కూడా ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు.
ఆయుధం శిక్షణ పొందిన తరువాత తీవ్రవాదం వైపు వెళ్తే బాధ్యులు ఎవరు? అని మండిపడ్డారు. రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ గుర్తించింది అన్నారు. సికింద్రాబాద్ కేసులో అరెస్టు అయిన పిల్లలకు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బెయిల్, వకాలత్, పూచీకత్తు అంతా మేమే చూసుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు రేవంత్ రెడ్డి.