చిరు తర్వాత అతడే నెక్స్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్..!

-

ఇటీవల కాలంలో మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు అంటూ దూసుకుపోతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కొరియోగ్రాఫర్ సుచిత్ర కూడా ఒకరు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎన్నో మంచి మంచి సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితురాలే. తాజాగా సినీ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ ఎవరు అన్న విషయంపై షాకింగ్ కామెంట్లు చేస్తూ చిరంజీవి తర్వాత బెస్ట్ డాన్సర్ అతనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో నటిస్తున్న స్టార్ హీరోలలో నంబర్ వన్ డాన్సర్ ఎవరు అనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపిస్తుంది. చిరంజీవి తర్వాత బెస్ట్ డాన్సర్ ఎవరు అని అడిగితే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానం గా చెబుతారు.. మరి కొంతమంది అల్లు అర్జున్ పేరు చెబుతారు. అయితే ఈ విషయంపై కొరియోగ్రాఫర్ సుచిత్ర మాట్లాడుతూ.. స్టైల్ విషయంలో చిరంజీవి గారిని రీప్లేస్ చేసేది ఎవరు అంటే ఆ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ అని అభిప్రాయపడ్డారు.

ఎలాంటి డాన్స్ మూమెంట్ చేయాలన్నా.. తారక్ చేయగలరని.. సుచిత్ర కామెంట్లు చేశారు. బన్నీ యూనిక్ గా డాన్స్ చేస్తారని.. అయితే ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదు అని సుచిత్ర తెలిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవరికి వాళ్లు యూనిక్ నెస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు అని కూడా ఆమె తెలిపారు. ముఖ్యంగా తనను తాను బిల్డ్ చేసుకునే విషయంలో అల్లు అర్జున్ గ్రేట్ అని సుచిత్ర తెలిపారు. నితిన్ కూడా బాగా డాన్స్ చేస్తారని తెలిపారు. కొన్ని సినిమాలలో స్క్రిప్టు బాలేదని కొన్ని సినిమాలకు.. స్క్రిప్ట్ బాగున్న సాంగ్స్ బాగుండడం లేదు అని కూడా సుచిత్ర తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news