సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోవడానికి పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాతే బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.
అమ్మవారి బోనాలను మంత్రి తలసాని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారని, ఆలయంతోపాటు…ఆలయ పరిసరాలను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారనీ కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆలయాలు, మసీదులు, చర్చీలు ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారనీ అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ కి ప్రత్యేకమైన పండగ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలని అన్నారు.
వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని.. అమ్మవారిని మొక్కుతున్నానాని తెలిపారు.ప్రపంచంలో ఇండియా అత్యున్నత శక్తిగా ఎదగాలని ఆశిస్తున్నానాని,అమ్మవారి ఆశీస్సులతో.. ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.