”మిస్టర్ చీఫ్ మినిస్టర్ ”.. ఫిక్సింగ్ రాజా ఎవరో చెప్పు : జగన్ పై పట్టాభి ఫైర్

టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరోసారి జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాల్పడినకుంభకోణాల్లో ఇసుక కుంభకోణం అత్యంతకీలకమైనదని… ప్రతిపక్షం ఇసుక దోపిడీపై ప్రశ్నించినా, నిర్మాణ రంగకార్మికులుపస్తులుండి చనిపోయినా, ఈ ప్రభుత్వం తనపంథా మార్చుకోలేదని మండిపడ్డారు. ఇసుక టెండర్లను ముందే ఫిక్సింగ్ చేసిన ప్రభుత్వం, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కోసం ఆ నిజాన్ని దాచేసిందని ఆగ్రహించారు.

రాజన్నరాజ్యంలో అత్యంత పారదర్శకంగా జరిగాయంటున్న ఇసుకటెండర్లలో ఫిక్సింగ్ రాజా ఎవరో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్‌ చేశారు పట్టాభి. మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇసుక టెండర్లకు సంబంధించిన ఒక్క కాగితాన్నికూడా జ్యూడీషియల్ ప్రివ్యూకి ఎందుకు పంపలేదు? ఇసుక టెండర్లలో చేయాల్సిందంతా చేసి, నీతి నిజాయితీ అంటూ పెద్దపెద్ద పదాలు వాడతారా? అని ఆగ్రహించారు.

ఇసుకటెండర్లకు సంబంధించిన టెక్నికల్ గైడ్ లైన్స్ తో తమకు సంబంధంలేదని ఎంఎస్ డీసీ గతంలోనే కుండబద్దలుకొట్టిందని… 01-10-2021న ఎంఎస్ డీసీ వారు తాము అడిగిన ఆర్టీఏ సమాచారానికి సమాధానమిచ్చారని తెలిపారు. దానిప్రకారం ఎన్నిప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు, ఏ కంపెనీలను ఎల్ 1 పరిగణించి టెండర్లు కట్టబెట్టారనే సమాచారమిచ్చారని వెల్లడించారు. జగనన్న ప్రభుత్వం అన్ని టెండర్లలో ఫిక్సింగ్ కి పాల్పడిందని ఆరోపించారు పట్టాభి.