హైదరాబాద్ ను వదలని భారీ వర్షం…మళ్లీ మొదలు

-

హైదరాబాద్‌ ను వరుణుడు పగబట్టాడా ? అన్నట్టు ఉంది పరిస్థితి. ఇవాళ కూడా నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. పంజాగుట్ట, చార్మినార్, సికింద్రాబాద్, తార్నాక సైదాబాద్, సంతోష్ నగర్,మలక్ పేట,ఎల్బీ నగర్లో , వనస్థలిపురం , హయత్ నగర్ ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షం మొదలయ్యింది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు.

ఎందుకంటే ఇప్పటికే వందకు పైగా కాలనీలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. మరో సారి వాన మొదలవ్వడంతో జనం భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. శిథిలమైన భవనాలలో ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news