మళ్లీ మొదలైన ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల అడ్మిషన్స్‌ …!

-

ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూల్ ల లో చేరడానికి అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది. 2020-21 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ఇంతకుముందే త్వరగా ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. కాకపోతే, అడ్మిషన్ల ప్రక్రియను వాయిదా వేయడంతో తిరిగి మళ్లీ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ దరఖాస్తు ప్రక్రియ నేటితో మొదలు జూలై 25 వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 164 పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కేవలం లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్లను కలిపించబోతున్నారు. ఇందుకోసం https://apms.apcfss.in/ వెబ్ సైట్స్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ap-model-school-admission-2020
ap-model-school-admission-2020

ఇక ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు 2019-20 విద్యాసంవత్సరం గాను ఐదో తరగతి చదివి ఉండాలి. ఇందుకు గాను ఓసీ, బీసీ విద్యార్థులకు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య అలాగే ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఈ దరఖాస్తుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 50, రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news