చైనా సరిహద్దుల్లో ఇప్పుడు… చైనా పీపుల్స్ ఆర్మీ వెనక్కు తగ్గడం వెనుక అనేక అనుమానాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. చైనా ఆర్మీ అసలు వెనక్కు తగ్గడానికి కారణం భారత్ కి ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, పరోక్షంగా రష్యా అండగా నిలవడమే అని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి చైనాకు పరోక్షంగా ఒత్తిడి వచ్చింది అని, రష్యా భారత్ కి ఆయుధపరంగా సాయం చేయడం కూడా చైనాను కంగారు పెట్టి ఉండవచ్చు అంటున్నారు.
అందుకే చైనా జాగ్రత్త పడి తన బలగాలను వెనక్కు తీసుకుంది అని అదే విధంగా దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఉద్రిక్త వాతావరణం కూడా చైనాకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. అక్కడ అమెరికా తన యుద్ద నౌకలను పంపడం కూడా చైనాకు ఇబ్బంది కరంగా మారిన అంశం. అందుకే చైనా ఇప్పుడు జాగ్రత్త పడి తన బలగాలను వెనక్కు తరలించి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.