అలా ఎలా ఓడి పోతున్నారు! కాంగ్రెస్ పై ఏఐసీసీ సీరియ‌స్

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు దారుణంగా ప‌డి పోతుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని నియ‌మించిన త‌ర్వాత అయినా కాంగ్రెస్ కు మంచి రోజులు వ‌స్తాయ‌ని అంద‌రూ భావించారు. కానీ కాంగ్రెస్ ప్ర‌జల‌ను ఏ మాత్రం ఆక‌ట్టు కోవ‌డం లేదు. ఈ మ‌ధ్య జ‌రిగిన దుబ్బ‌క‌, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లలో కాంగ్రెస్ పార్టీ దార‌ణ మైన ఫ‌లితాల‌ను ముట‌గట్టుకుంది.

రేవంత్ పీసీసీ చీఫ్ గా అయిన త‌ర్వాత జ‌రిగిన హుజురాబాద్ బై పోల్స్ లో కూడా ఇదే ఫ‌లితం రిపీట్ అయింది. అంతే కాకుండా ఇక్క‌డ క‌నీసం డిపాజిట్స్ కూడా ద‌క్క‌లేదు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పై ఏఐసీసీ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ఎలా ఓడిపోయామో గ్రౌండ్ రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. అలాగే తెలంగాణ ఇచ్చిన పార్టీ గా ప్ర‌జలు ఎందుకు గుర్తుపెట్టు కోవ‌డం లేద‌ని ప్రశ్నించింది.

 

ఎన్నిక‌ల‌లో ఓడిపోవ‌డం స‌మ‌స్య కాదు. కానీ ఒక్క ఎన్నిక‌ల‌లో అయినా ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేద‌ని ఏఐసీసీ అంది. క‌నీసం రాష్ట్రం లో కాంగ్రెస్ సాంప్ర‌దాయ ఓట‌ర్ల ను కాపాడు కోవ‌డం లేద‌ని ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. దీని పై వెంట‌నే స‌మాధానం కావాల‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జీ మాణిక్కం ఠాగుర్ ను ఏఐసీసీ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news