జరిమానా ఎఫెక్ట్.. ఎయిర్​ఇండియా కీలక నిర్ణయం

-

ఎయిర్ ​ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. ఆపైన వారికి సర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. మద్యం విషయంలో జనవరి 19న కొన్ని సవరణలు చేపట్టింది ఎయిర్​ఇండియా.

అయితే మద్యం ఇవ్వమని చెప్పే విషయంలో గౌరవప్రదమైన పద్ధతిలో ప్రయాణికులతో నడుచుకోవాలని సూచించింది. వారిని తాగుబోతు అని పిలవడం, వాదనకు దిగటం, వారితో హెచ్చుగా మాట్లాడటం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులను గుర్తించే బాధ్యత సిబ్బందిదేనని సూచించింది.

గతేడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించిన రిపోర్టును అందించని కారణంగా డీసీజీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. విమానంలో డిసెంబరు 6న ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు వాష్​రూమ్​కు వెళ్లిన సమయంలో.. మరో వ్యక్తి ఆమె సీట్​పై ఉన్న దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు.

మరో ప్రయాణికుడు మద్యం మత్తులో ఉండి పొగ తాగుతూ మరుగుదొడ్ల గదిలో సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ విషయాలపై అడిగే వరకు నివేదిక ఇవ్వలేదని ఎయిర్ఇండియాను డీజీసీఏ ఇదివరకే తప్పుబట్టింది. షోకాజ్ నోటీసులు పంపించి తాజాగా రూ. 10 లక్షల జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news