వర్మ వర్సెస్ అమృత.. ఇదంతా ఫేక్ న్యూస్.!

-

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రేమ వ్యవహారం, ప్రణయ్ మర్డర్, మారుతీరావు ఆత్మహత్య.. ఈ అంశాలనే తన కథాంశంగా ఎంచుకొని ‘మర్డర్’ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో నిన్న  ఫాదర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో మరోసారి ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. దీంతో, వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి.

war of word between rgv and amrutha pranay

 

పోస్టర్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆమె అన్నట్టు కథనాలు వచ్చాయి. అమృత వ్యాఖ్యలకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని… నిజమైన స్టోరీ అని చెప్పలేదని అన్నారు. కాగా, తాజాగా ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. అమృత పేరిట సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వర్మ సినిమాపై అమృత స్పందించలేదని అన్నారు. ఆమె పేరుపై వస్తున్న స్టేట్మెంట్లను నమ్మొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news