‘థ్యాంక్ గాడ్’ సినిమా ట్రైలర్ రిలీజ్.. మోడ్రన్ చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ అదుర్స్

-

యముడు, యమలోకం, చిత్రగుప్తుడిపై ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ వచ్చిన అన్ని సినిమాలో యమలోకం, యముడు, చిత్రగుప్తుడిని పాతకాలం వేషధారణలో పంచెకట్టు, తలపాగా, కిరీటంతో చూశాం. కానీ మోడ్రన్ చిత్రగుప్తుడిని ఎప్పుడైనా చూశారా. చూడాలనుకుంటే థ్యాంక్ గాడ్ సినిమా చూడాల్సిందే.

సూటుబూటులో గడ్డంతో స్టైలిష్‌గా వస్తున్న మోడ్రన్ చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ ఆకట్టుకున్నాడు. యన ఉన్న లోకం కూడా అత్యాధునిక హంగులతో మెరిసిపోతుంది. మరి ఈ చిత్రగుప్తుడి కథేంటో తెలియాలంటే ‘థ్యాంక్‌ గాడ్‌’ (Thank God) సినిమా చూడాల్సిందే.

అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా నటించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఇంద్రకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. సిద్ధార్థ్‌ కారు ప్రమాదానికి గురై యమలోకానికి వెళ్లడం అక్కడ చిత్రగుప్తుడిగా అజయ్‌ ప్రత్యక్షమవ్వడం మెప్పిస్తాయి. అజయ్‌ ఆడించిన ‘గేమ్‌ ఆఫ్‌ లైఫ్‌’లో సిద్ధార్థ్‌ ఆడిన తీరు ఆకట్టుకుంటుంది. మరి ఆట ఏంటి? ఎలా సాగింది? సిద్ధార్థ్‌ తిరిగి బతికాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అక్టోబరు 25న తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజే ‘థ్యాంక్‌ గాడ్‌’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news